ఎర్ర తువ్వాలు ధరిస్తే తప్పా..నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్!

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని చోట్ల ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగింది. మరికొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

Update: 2024-05-13 14:18 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని చోట్ల ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగింది. మరికొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇక ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్, వైసీపీ అభ్యర్థిగా వంగా గీత పోటీలో ఉన్నారు. ఇక అందరి చూపు పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం వైపే ఉంది. ఈ క్రమంలో పిఠాపురంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓ వ్యక్తి ఎర్ర తువ్వాలు ధరించి వచ్చినందుకు అతన్ని చూసిన వంగా గీత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తవల్ మెడలో ఎలా వేసుకుని వస్తారంటూ పోలింగ్ సిబ్బందిని ప్రశ్నించింది.

ఈ ఘటనపై తాజాగా నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికల బూత్‌లో ఓ వ్యక్తి ధరించిన ఎర్ర తువ్వాలును తొలగించాలని చెప్పడంపై జనసేన నాయకుడు నాగబాబు తీవ్రంగా స్పందించారు. ఎర్ర తువ్వాలుని కాశీ తువ్వాలు అంటారు. దీనిని కష్టం చేసుకునే ప్రతి కార్మికుడు ధరించవచ్చు. ఇది ధరించడం వారి హక్కు అని చెప్పారు. తువ్వాలు వేసుకోవడాన్ని అడ్డుకోవడం అనేది చట్టాన్ని ధిక్కరించడమే అవుతుంది. తర్వాత మీ ఇష్టం అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Tags:    

Similar News