పొత్తులపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులపై బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ...

Update: 2024-03-10 11:38 GMT

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులపై బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని ఓడించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని, కానీ తాను మాత్రం ప్రజలను గెలిపించేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. పొత్తులతో చంద్రబాబు.. ప్రజల బలంతో వైసీపీ ఎన్నికలకు వెళ్తోందన్నారు. వచ్చే ఎన్నికలు ధర్మం.. అధర్మం మధ్య యుద్ధం జరగబోతోందని వ్యాఖ్యానించారు. ‘సిద్ధం’ అంటేనే ఓ ప్రజా సముద్రం కనిపిస్తోందని చెప్పారు. వైసీపీ సిద్ధం సభకు వచ్చిన వాళ్లందరూ స్టార్ క్యాంపెయినర్లు అని జగన్ తెలిపారు. తనకు నటించే పొలికల్ స్టార్స్ లేరని చెప్పారు. వచ్చే ఎన్నికలు ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా సిద్ధమైందన్నారు. చంద్రబాబు గుండెల్లో జగన్ రైళ్లు పరిగెత్తించారని, అందుకే ఇన్ని పొత్తులు పెట్టుకుంటున్నాడని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

‘సైకిల్ చక్రం తిరగడం ఆగిపోయింది. అందుకే దత్తపుత్తుడిని తీసుకొచ్చారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ దగ్గర మోకరిల్లారు. పొత్తు పెట్టుకున్న పార్టీలకు సైన్యం లేదు. పొత్తుల కోసం ఎందుకు అగచాట్లు. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీ అటు వైపు ఉంది. ఆ మూడు పార్టీలు 2014లోనూ పొత్తులు పెట్టుకున్నాయి. ఎన్ని హామీలు నెరవేర్చాయి. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ఆ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ యుద్ధంలో ప్రజలది శ్రీకృష్ణుడు పాత్ర, నాది అర్జునుడి పాత్ర. ఓటు అనే అస్త్రాన్ని బయటకు తీయండి. వచ్చే ఎన్నికల్లో విశ్వసనీయతకు ఓటు వేయండి.’ అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.

Read More..

సిద్ధం సభలకు YCP అన్ని కోట్లు ఖర్చు చేసిందా..? కీలక విషయాలు బయటపెట్టిన షర్మిల

Tags:    

Similar News