Wedding Season: మల్లెపూలకు పెరిగిన డిమాండ్ .. కొండెక్కిన ధరలు

వేసవి సీజన్ వచ్చిందంటే చాలు.. మగువ మనసు మల్లెపూల వైపే ఉంటుంది...

Update: 2023-03-16 10:59 GMT

దిశ, తిరుపతి: వేసవి సీజన్ వచ్చిందంటే చాలు.. మగువ మనసు మల్లెపూల వైపే ఉంటుంది. అయితే మల్లెల సీజన్ కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. దీంతో పూల ధరలు మండిపోతున్నాయి. మరోవైపు గిరాకీకి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో మల్లె ధరలు కొండెక్కాయి. వాసన చూద్దామంటే మల్లెపువ్వులు కరువైపోయాయని కుప్పం, శాంతిపురం వాసులు అంటున్నారు.

చెమటలు పట్టిస్తున్న మల్లెపూల ధరలు

చిత్తూరు, మదనపల్లె జిల్లాలో ఎండలే కాదు…మల్లెపూల ధరలు చెమటలు పట్టిస్తున్నాయి. హోల్‌సేల్‌ మార్కెట్‌లో కేజీ మల్లెపూల ధర వెయ్యి రూపాయల నుంచి 12 వందలు పలుకుతున్నాయి. పూల ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు కొనాలంటేనే భయపడి పోతున్నారు. మల్లెపూల పంట ఆరంభం దశ కావడంతో ఇంకా పూర్తి స్థాయిలో పంట అందుబాటులోకి రాకపోవడంతో డిమాండ్‌కి తగ్గ సరుకు లేకపోవడంతో ధరలు పెరిగిపోయాయి. వేసవి కాలంలోనే లభించే పూలు కావడంతో మగువలు అధికంగా వీటిని ఇష్టపడతారు. అయితే పూర్థి స్థాయిలో అందుబాటులోకి వస్తే ధరలు తగ్గుతాయంటున్నారు వ్యాపారస్తులు.

Also Read..

నైట్రేట్ కలుషిత నీటితో ప్రొస్టేట్ క్యాన్సర్.. తాజా అధ్యయనం 

Tags:    

Similar News