MLC Election: తూర్పు రాయలసీమలోనూ సేమ్ సీన్ రిపీట్

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది...

Update: 2023-03-17 11:40 GMT

దిశ, వెబ్ డెస్క్: తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుత్తం తొలి ప్రాధాన్యత లెక్కింపు ముగిసింది. ఉత్తరాంధ్రలోనే కాదు ఇక్కడ కూడా టీడీపీ అధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం ఏడు రౌండ్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్ 25,262 ఓట్లతో ముందంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్‌కు 1,12,514 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డికి 85,252 ఓట్లు పోల్ అయ్యాయి. ఎవరికీ స్పష్టమైన ఓట్ల మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును పరిగణనలోకి తీసుకోనున్నారు.మొత్తం 2 లక్షల 70 లక్షల ఓట్లు నమోదు అయ్యాయి. వీటిలో 51 శాతం ఓట్లు వస్తే వారికి గెలుపు అవకాశం ఉంటుంది. తాజాగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరి ఈ రౌండ్‌లో ఎక్కువ ఓట్లు ఎవరి సాధిస్తారో చూడాలి..

ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా

ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ దూసుకుపోతోంది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ జరిగింది. ఇవాళ కౌంటింగ్ చేపట్టారు. ఈ కౌంటింగ్‌లో టీడీపీ బలపర్చిన అభ్యర్థికి భారీగా ఓట్లు పోల్ అయ్యాయి. తొలి రౌండ్ నుంచే అధిక్యంలో కొనసాగారు. మొత్తం 7 రౌండ్లు పూర్తి అయ్యే సరికి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి 26,358 ఓట్ల అధిక్యంలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థికి 80,762 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 54, 404 ఓట్లు వచ్చాయి. పీడీఎఫ్ అభ్యర్థి రామాప్రభకు 33,464, బీజేపీ అభ్యర్థి మాదవ్‌కు 8,988 ఓట్లు వచ్చాయి. మొత్తం 8 రౌండ్లు కాగా ఇప్పటి వరకూ 7 రౌండ్ల లెక్కింపు పూర్తి అయ్యింది. చివరి రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. చివరి వరకు ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News