Fire Accident: అనంతపురం శారదానగర్‌లో విషాదం

అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శారదానగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్య్కూట్‌తో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి..

Update: 2022-11-23 16:49 GMT

దిశ వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శారదానగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్య్కూట్‌తో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మహిళ మృతి చెందారు. ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలార్పారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. గాయపడిన చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Similar News