ఇదీ ఖాకీల పని తీరు.. రంగమ్మత్త విమర్శ

తమిళనాడు సతంకుళం ఘటన, తెలంగాణ కొత్తగూడెం జిల్లాలో 17 ఏళ్ల అమ్మాయి అత్యాచారం, హత్య ఘటనలపై సోషల్ మీడియాలో నిరసన తెలుపుతున్నారు నెటిజన్లు. నిందితులను కఠినంగా శిక్షించాలని సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రెండు ఘటనలపై స్పందించింది జబర్దస్త్ యాంకర్, రంగస్థలం రంగమ్మత్త అనసూయ భరద్వాజ్. ‘అసలు పోలీసులకు ఎలాంటి వారిని శిక్షించాలి? ఎక్కడ ఎలాంటి శిక్షను అమలు చేయాలి? అనేది అర్థం అవడం లేదేమో’ అని విమర్శించింది. తమిళనాడులో జస్ట్ 15 […]

Update: 2020-06-28 05:41 GMT

తమిళనాడు సతంకుళం ఘటన, తెలంగాణ కొత్తగూడెం జిల్లాలో 17 ఏళ్ల అమ్మాయి అత్యాచారం, హత్య ఘటనలపై సోషల్ మీడియాలో నిరసన తెలుపుతున్నారు నెటిజన్లు. నిందితులను కఠినంగా శిక్షించాలని సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రెండు ఘటనలపై స్పందించింది జబర్దస్త్ యాంకర్, రంగస్థలం రంగమ్మత్త అనసూయ భరద్వాజ్.

‘అసలు పోలీసులకు ఎలాంటి వారిని శిక్షించాలి? ఎక్కడ ఎలాంటి శిక్షను అమలు చేయాలి? అనేది అర్థం అవడం లేదేమో’ అని విమర్శించింది. తమిళనాడులో జస్ట్ 15 నిమిషాలు షాప్ కట్టేయడం ఆలస్యమైనందుకు.. లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించారని తండ్రీ కొడుకులను లాకప్‌లో దారుణంగా కొట్టి చంపేశారు. అదే సమయంలో కొత్తగూడెంలో 17 ఏళ్ల పాపపై అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి చంపేసి, శరీరంపై బట్టలు కూడా లేకుండా ఆ ఆడబిడ్డ శవాన్ని రైల్వే ట్రాక్‌పై పడేస్తే మాత్రం నిందితులను ఇప్పటి వరకు పట్టుకోలేక పోయారని మండిపడింది అనసూయ. భారతదేశంలో పోలీసుల విధి నిర్వహణ ఈ తీరుగా ఉందని విమర్శించింది.

Tags:    

Similar News