నేషనల్ క్రష్ రష్మికలో ఆ టాలెంట్ కూడా ఉందా..? వీడియో వైరల్

‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2024-04-29 03:00 GMT

దిశ,సినిమా: ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నది. ఇటీవల యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న నేషనల్ క్రష్.. ఇప్పుడు పుష్ప 2, రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్, కుబేర వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఈ నాలుగు చిత్రాలు కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవే కాకుండా అటు మూవీ ఈవెంట్స్.. అవార్డు ఫంక్షన్లలోనూ సందడి చేస్తుంది రష్మిక. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ హంగామా చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పాత వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఆమ్లెట్ తయారు చేసే విధానాన్ని వివరిస్తానని చెబుతూ వీడియో ని ప్రారంభించింది. నువ్వుల నూనె, నెయ్యి, బచ్చలికూర, పుట్టగొడుగులు టెరియాకి సాస్ వంటి సాధారణ పదార్థాలను ఉపయోగించి ఆమ్లెట్ వేసింది. ఆమ్లెట్ ఎలా వేయాలో చెబుతూ వీడియోను షేర్ చేసింది రష్మిక. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. నేషనల్ క్రష్ వంట చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ, నువ్వు మల్టీ టాలెంటెడ్ అని కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Similar News