'ఆ రెండు శాఖల సమన్వయంతోనే పనులు'

దిశ, ఆదిలాబాద్: జాతీయ ఉపాధి హామీ పథకం పనులను నీటిపారుదల, గ్రామీణ అభివృద్ధి శాఖల సమన్వయంతో చేపట్టాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏ. భాస్కర రావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ, హరితహారం కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి సంబంధించి సాగునీటి ప్రాజెక్టుల కాలువల పనులు, చెట్లను తొలగించుట తదితర పనులను గ్రామసభల ఆమోదంతో నిర్వహించాలని సూచించారు. ఉపాధి […]

Update: 2020-06-17 06:47 GMT

దిశ, ఆదిలాబాద్: జాతీయ ఉపాధి హామీ పథకం పనులను నీటిపారుదల, గ్రామీణ అభివృద్ధి శాఖల సమన్వయంతో చేపట్టాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏ. భాస్కర రావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ, హరితహారం కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి సంబంధించి సాగునీటి ప్రాజెక్టుల కాలువల పనులు, చెట్లను తొలగించుట తదితర పనులను గ్రామసభల ఆమోదంతో నిర్వహించాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచి వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని చెప్పారు. అలాగే, ఈనెల 20న ప్రారంభించే హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భాస్కర రావు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News