నాకు తల్లి కావాలని ఉంది.. భర్త ‘వీర్యం’ కోసం కోర్టుమెట్లెక్కిన భార్య.. జడ్జిమెంట్ అదుర్స్..!

అహ్మదాబాద్: భర్త ఆరోగ్యం విషమంగా ఉన్నదని ఆయన వీర్యాన్ని భద్రపరచాలని కట్టుకున్న భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఘటన గుజరాత్‌ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ఎనిమిది నెలల కిందట వివాహం చేసుకున్న ఆ దంపతులపై కరోనా పంజా విసిరింది. కరోనా నుంచి కోలుకున్నాక ఇద్దరిలో భర్త  అవయవాలు దెబ్బతిన్నాయి. మళ్లీ ఆస్పత్రిలో చేర్పించగా 24 గంటలు మించి బతికే అవకాశాలు తక్కువని వడోదరలోని స్టెర్లింగ్ హాస్పిటల్ వైద్యులు చెప్పారు. ఆయన కుటుంబం ఆవేదనతో కుమిలిపోయింది. అదే […]

Update: 2021-07-22 10:34 GMT

అహ్మదాబాద్: భర్త ఆరోగ్యం విషమంగా ఉన్నదని ఆయన వీర్యాన్ని భద్రపరచాలని కట్టుకున్న భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఘటన గుజరాత్‌ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ఎనిమిది నెలల కిందట వివాహం చేసుకున్న ఆ దంపతులపై కరోనా పంజా విసిరింది. కరోనా నుంచి కోలుకున్నాక ఇద్దరిలో భర్త అవయవాలు దెబ్బతిన్నాయి. మళ్లీ ఆస్పత్రిలో చేర్పించగా 24 గంటలు మించి బతికే అవకాశాలు తక్కువని వడోదరలోని స్టెర్లింగ్ హాస్పిటల్ వైద్యులు చెప్పారు. ఆయన కుటుంబం ఆవేదనతో కుమిలిపోయింది. అదే సమయంలో భవిష్యత్ గురించి ఆలోచించి తన భర్త వీర్యకణాలు భద్రపరచాలని భార్య వైద్యులను కోరింది.

కోమాలోకి వెళ్లిన పేషెంట్ సమ్మతి లేకుండా వీర్యం కలెక్ట్ చేసే అధికారం తమకు లేదని వైద్యులు చెప్పారు. దీంతో అత్యవసర విచారణను కోరుతూ ఆమె గుజరాత్ హైకోర్టు మెట్లెక్కింది. పేషెంట్ సమ్మతి కోరే అవకాశాల్లేవని, అసాధారణ పరిస్థితుల రీత్యా ఆయన భార్య కోరిక మేరకు వీర్యకణాలు భద్రపరచాలని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జులై 23న తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్ వేయడం ద్వారా ఆమె సంతానాన్ని కలిగే అవకాశాన్ని తిరిగి దక్కించుకున్నదని న్యాయవాది నిలయ్ పటేల్ తెలిపారు.

Tags:    

Similar News