బేరాల్లేవ్.. ‘అలుగు’విలువ రూ. కోటిన్నర

దిశ, బెల్లంపల్లి : వన్య ప్రాణుల వేటాడుతున్న అక్రమార్కులపై ఫారెస్ట్, పోలీసు అధికారులు తీవ్రంగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే రూ. కోటికి ‘అలుగు’ను అమ్మేందుకు ప్రయత్నించిన 8మంది ముఠా సభ్యులను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. వివరాల్లోకివెళితే.. మంచిర్యాల జిల్లా కాసిపేట పీఎస్ పరిధిలోని సండ్రపేట్ గ్రామ శివారులో అలుగును కొందరు దళారులు గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతుండగా టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడులు జరిపారు. ఆ సమయంలో అక్కడ ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. […]

Update: 2021-01-24 10:10 GMT

దిశ, బెల్లంపల్లి : వన్య ప్రాణుల వేటాడుతున్న అక్రమార్కులపై ఫారెస్ట్, పోలీసు అధికారులు తీవ్రంగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే రూ. కోటికి ‘అలుగు’ను అమ్మేందుకు ప్రయత్నించిన 8మంది ముఠా సభ్యులను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. వివరాల్లోకివెళితే.. మంచిర్యాల జిల్లా కాసిపేట పీఎస్ పరిధిలోని సండ్రపేట్ గ్రామ శివారులో అలుగును కొందరు దళారులు గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతుండగా టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడులు జరిపారు. ఆ సమయంలో అక్కడ ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అంతకుముందు బెల్లంపల్లి బుగ్గగుట్ట ప్రాంతంలో అడవి అలుగు తిరుగుతుందనే సమాచారంతో సండ్రపేటకు చెందిన దాడి మల్లేష్ దానిని పట్టుకుని ఇంట్లో దాచిపెట్టాడు. అనంతరం ఏదుల లక్ష్మణ్, కొంతమంది దళారులతో కలిసి రూ. కోటిన్నరకు దానిని అమ్మేందుకు ప్రయత్నించాడు. సరిగ్గా ఈ సమయంలోనే 0నిందితులు పోలీసులకు చిక్కారు. పట్టుబడిన వారిలో కాసిపేట మండలం నాయకపు బుర్ర గూడానికి చెందిన పల్లె శంకర్, పల్లె రవి, కన్నెపల్లి మండలానికి చెందిన మార్నేని రాజ్ కుమార్, ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం కొంచెవల్లి వాసి దిగిడె శంకర్, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన రెడ్డిపాక నరేందర్, నస్పూర్ మండలం సీసీ కార్నర్‌కు చెందిన మాలో కిషోర్ ఉన్నారు.మంచిర్యాలకు చెందిన కిరణ్ అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. కాగా, క్యాన్సర్‌కు సంబంధించిన మెడిసిన్ తయారీలో అలుగు పొలుసు వాడుతారని.. ఈ జీవికి చైనా మార్కెట్లోనూ అధిక ధర పలుకుతుందని ప్రచారం సాగుతోంది.

Tags:    

Similar News