ఆ బ్రాండ్ బీర్లు దొరికేలా చేయండి.. మహాప్రభో..!

ప్రజల దాహార్తి తీర్చే ఆ బీర్లు దొరకడం లేదు.

Update: 2024-04-29 11:13 GMT

దిశ, ఆదిలాబాద్ బ్యూరో : ప్రజల దాహార్తి తీర్చే ఆ బీర్లు దొరకడం లేదు. దాంతో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ బీర్లు అందుబాటులో ఉండేలా చూడాలని తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంచిర్యాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందించారు. జిల్లాలోని వైన్స్, బార్లలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదని తెలిపారు. ఎండ తీవ్రతలు ఎక్కువ అవుతున్న కొద్దీ ప్రజలకు ముఖ్యంగా యువకులు, పెద్దలు దాహం తీర్చుకునేందుకు ఇబ్బందులకు గురవుతున్నారనీ అన్నారు.

ఈ జిల్లాలోనే కాకుండా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో కూడా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ లైట్ బీర్లను తాగడం ద్వారా మత్తు తక్కువ సమయం ఉంటుందని, ఆ తర్వాత మా పనులను మేము చేసుకోగలుగుతామని చెప్పారు. స్ట్రాంగ్ బీర్లు తాగడం ద్వారా కడుపులో మంట, తీవ్రమైన తలనొప్పి, వాంతులు వంటివి వస్తున్నాయని చెప్పారు. మాకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి మాకు కావాల్సిన కింగ్ ఫిషర్ బీర్లను జిల్లాలోని అన్ని వైన్ షాపులు, బార్లలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Similar News