'ప్రయోన్' బిజినెస్ సర్వీసెస్ కంపెనీని కొనుగోలు చేయనున్న అమెజాన్!

by  |
AMAZON
X

దిశ, వెబ్‌డెస్క్: ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి సారథ్యంలోని కాటమరాన్ వెంచర్స్‌, ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ సంయుక్తంగా ప్రయోన్ బిజినెస్ సర్వీసెస్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ జాయింట్ వెంచర్‌ను నిలిపేయాలని ఇరు సంస్థలు నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రయోన్‌ను అమెజాన్ సొంతం చేసుకోనున్నట్టు బుధవారం వెల్లడించింది. అయితే, దీనికి సంబంధించిన కారణాలను ఇరు కంపెనీలు బయటపెట్టక పోయినప్పటికీ కంపెనీలోని మొత్తం వాటాలను కొనుగోలు చేస్తామని అమెజాన్ స్పష్టం చేసింది.

ఈ వాటాలను కొనేందుకు అమెజాన్ సంస్థ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నుంచి అనుమతి కోసం అభ్యర్థించింది. దీని తర్వాత యాజమాన్యంలో ఎలాంటి మార్పులు చేయబోమని కంపెనీ పేర్కొంది. అన్ని ఆస్తులు, బాధ్యతలను చట్టాలకు అనుగుణంగా అమెజాన్ కొనుగోలు చేస్తుంది. జాయింట్ వెంచర్‌కు చెందిన వ్యాపారాలు ప్రస్తుతం ఉన్న మేనేజ్‌మెంట్ చేతిలోనే ఉంటాయని, నియంత్రణ సంస్థ అనుమతి తర్వాత చట్టానికి అనుగుణంగా లావాదేవీలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు కంపెనీ వివరించింది. కాగా, కాటమరాన్, అమెజాన్ సంయుక్తంగా 2014 లో ప్రయోన్ కంపెనీని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed