వ్యూహాత్మకం.. పీఆర్సీపై సపరేట్ సమావేశాలు!

by  |
వ్యూహాత్మకం.. పీఆర్సీపై సపరేట్ సమావేశాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : వేతన సవరణ నివేదికపై ఉద్యోగులతో చర్చలకు కొత్త సాంప్రదాయానికి దిగారు. పీఆర్సీ నివేదికపై గతంలో ఉద్యోగ సంఘాల జేఏసీతో సమిష్టిగా సమావేశమైన అధికారులు ఈసారి మాత్రం వేర్వేరుగా చర్చలకు పిలిచారు. విభజించు.. పాలించు తరహాలో ఉద్యోగ సంఘాలనతో భేటీ అయ్యారని, దీనిలో పెద్ద కుట్ర దాగివుందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

వ్యూహాత్మకంగా..

రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్​ ఆధ్వర్యంలోని త్రీమెన్​ కమిటీ భేటీ మొదలైంది. బుధవారం ముందుగా మూడు ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. దీనిలో అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒకేసారి అందరినీ పిలిస్తే అందరూ ఏకతాటిపై ఉంటారని భావించిన అధికారులు వారిని వేర్వేరుగా పిలిచారు. అయితే ముందుగా ఒక యూనియన్​ నుంచి కనీసం నలుగురిని పిలువాలని నిర్ణయం తీసుకున్నా ప్రతినిధుల బృందాన్ని రావాలని ఆహ్వానం పంపించారు.

ఇలా ఒక సంఘానికి కనీసం 20 నుంచి 30 నిమిషాల సమయం కేటాయిస్తున్నారు. కొన్ని సంఘాలకు 10 నుంచి 15 నిమిషాలే ఇవ్వనున్నట్లు అధికారులు చెప్పుతున్నారు. ఒకేసారి అన్ని సంఘాల నేతలను రమ్మనడం లేదు. ఎందుకంటే ఫిట్​మెంట్​పై అందరూ ఒకే మాట మాట్లాడితే ఇబ్బందులుంటాయని సీఎస్​ ఆధ్వర్యంలోని కమిటీ గుర్తించినట్లు ఉద్యోగులు చెప్పుతున్నారు. ఇలా ఒక్కో సంఘాన్ని వేర్వేరుగా పిలిచి చర్చిస్తున్నారు. ఇలా చేస్తే ఫలానా సంఘం 10 శాతం ఫిట్​మెంట్​కే ఒప్పుకుందని, ఇంకో సంఘం 8 శాతం అయినా చాలందని ఉద్యోగ సంఘాలను మెప్పించేందుకు అధికార కమిటీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

దీనిలో భాగంగా బుధవారం ముందుగా తెలంగాణ నాన్​ గెజిటెడ్​ అధికారుల సంఘం (టీఎన్జీఓ)తో సీఎస్​ కమిటీ భేటీ అయింది. ఫిట్​మెంట్​తోపాటు పలు అంశాలను సీఎస్​కు సూచించారు. ఆ తర్వాత తెలంగాణ గెజిటెడ్​ అధికారుల సంఘం (టీజీఓ), వారి తర్వాత సచివాలయ ఉద్యోగుల సంఘం భేటీ అయ్యారు. ఆయా సంఘాలన్నీ సీఎస్​కు మరోసాని వినతిపత్రాలిచ్చాయి.

ఫిట్​మెంట్​ను 63 శాతం ఇవ్వాలని, కనీస వేతనం రూ. 24 వేలు ఉండాలని, గరిష్ఠ వేతనం రూ. 2.19 లక్షలుగా ఉండాలని వినతిపత్రాల్లో సూచించారు. హెచ్​ఆర్​ను హైదరాబాద్​లో 30 శాతం, జిల్లా కేంద్రాల్లో 20 శాతం ఇవ్వాలని, అటోమెటిక్​ అడ్వాన్స్​మెంట్​ 5, 10, 15, 20, 25 ఏండ్లుగా ఉండాలని, పదవీ విరమణ బెనిఫిట్స్​ రూ. 20 లక్షలు చేయాలంటూ వినతిపత్రాల్లో సూచించారు. ఉద్యోగులతో చర్చించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని సీఎస్​ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.



Next Story

Most Viewed