ఆసుపత్రిలో వైద్యుల కోసం.. అఖిలపక్ష పార్టీల బంద్

by  |
ఆసుపత్రిలో వైద్యుల కోసం.. అఖిలపక్ష పార్టీల బంద్
X

దిశ, మణుగూరు : నాలుగు మండలాల ప్రజల కోసం నిర్మించిన వందపడకల ఆసుపత్రిలో డాక్టర్లలను, సిబ్బందిని వెంటనే నియమించాలని మండలంలో అఖిలపక్ష పార్టీలు బంద్ కు పిలుపు నిచ్చాయి. శనివారం ఉదయం నుంచి జెండాలు పట్టుకుని బంద్ విజయవంతం చేయాలని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆరు సంవత్సరాల నుంచి వందపడకల ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది లేకుండా ఉంటే, ఉన్నారంటూ అధికార పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలు చేయడం మానుకోవాలన్నారు.

నిజానికి ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది ఉంటే ప్రజలకు, అఖిలపక్ష పార్టీ నాయకులకు చూపించాలన్నారు. తప్పుడు రాజకీయాలు చేయడం మానుకొని, ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు వేరే విధంగా ఉంటాయని హెచ్చరించారు.

ఈ ర్యాలీలో సీపీఐ నాయకులు బీ.అయోధ్య, టీడీపీ నాయకులు చలపతిరావు, బీజేపీ నాయకులు లింగంపల్లి రమేష్, కాంగ్రెస్ నాయకులు పీరినకి నవీన్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఆర్.మధుసూధన్ రెడ్డి, సీపీఎం నాయకులు ఉప్పుతల నర్సింహారావు, జనాసమితి నాయకులు పగడాల కరుణాకరరెడ్డి లతో పాటు తదితర నాయకులు పాల్గొన్నారు.

Next Story