‘18+ వారందరూ టీకా తీసుకోవచ్చు’

by  |
‘18+ వారందరూ టీకా తీసుకోవచ్చు’
X

వాషింగ్టన్: ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదుచేస్తున్న అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. లైఫ్ అండ్ డెత్ రేస్‌లో వైరస్ మహమ్మారా? లేక వ్యాక్సినేషనా? అన్నట్టుగా దూకుడుగా వ్యవహరిస్తున్నది. కరోనా నిబంధనలపాలనతోపాటు వైరస్‌ను ఎదుర్కోవడానికి టీకానే అస్త్రమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. వైట్‌హౌజ్‌లో ప్రసంగిస్తూ టీకా పంపిణీపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరో రెండు వారాల తర్వాత వయస్సు, ఆరోగ్య సమస్యలు మాత్రమే టీకా పంపిణీకి ప్రాధాన్యత అంశాలుగా ఉండవని, పెద్దసంఖ్యలో ప్రజలకు టీకా పంపిణీ చేస్తామని అన్నారు. 18ఏళ్లు దాటిన వయోజనులందరూ ఈ నెల 19 నుంచి టీకా అర్హులేనని, వారంతా టీకా తీసుకోవచ్చునని ప్రకటించారు. వ్యాక్సినేషన్‌లో యూఎస్ దూసుకుపోతున్నదని, 15కోట్ల డోసులు వేసిన తొలి దేశం అమెరికానేనని అన్నారు. 6.2కోట్ల మంది సంపూర్ణంగా వ్యాక్సిన్‌ తీసుకున్నారని వివరించారు. ఇదిలా ఉండగా అమెరికా ఎకనామిక్ పవర్‌హౌజ్‌గా పిలిచే కాలిఫోర్నియా మళ్లీ పూర్తిస్థాయిలో వ్యాపారాలను నిర్వహించడానికి సిద్ధమవుతున్నది. వ్యాపారాలన్నీ పూర్తిగా ఓపెన్ చేయడానికి జూన్ 15 టార్గెట్‌గా పెట్టుకుంది.



Next Story

Most Viewed