ఉస్మానియా ఆస్పత్రికి అఖిల‌ప్రియ

71

దిశ,వెబ్‌డెస్క్: మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి పోలీసులు శనివారం తరలించారు. ఆమెకు సిటీ స్కాన్, అల్ట్రా సౌండ్ స్కాన్ ను వైద్యులు నిర్వహించారు. అఖిల ప్రియ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు వెల్లడించారు. కాగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై సికింద్రబాద్ కోర్టు నివేదిక కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నివేదికను కోర్టుకు జైలు అధికారులు సోమవారం సమర్పించనున్నారు. ఆమె బెయిల్, కస్టడీ పిటిషన్లపై కోర్టులో సోమవారం విచారణ చేపట్టనున్నారు.