మగాళ్లూ జాగ్రత్త.. అలా చేస్తే వీర్య కణాలపై ఎఫెక్ట్

by  |
Air pollution
X

దిశ, ఫీచర్స్: వాయు కాలుష్యం.. ఊబకాయం, మధుమేహం, వంధ్యత్వం వంటి అనారోగ్య సమస్యలు ప్రమాదాన్ని పెంచుతుందనేది తెలిసిన విషయమే. కానీ, అది ఎలా అనే విషయంలో వారికి క్లారిటీ లేదు. కాగా, వాయు కాలుష్యం మెదడులో మంటను ప్రేరేపించడం ద్వారా స్పెర్మ్ కౌంట్‌ను ప్రభావితం చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (UMSOM) పరిశోధకులు ఎలుకలపై నిర్వహించిన ప్రయోగం ద్వారా కనుగొన్నారు.

మెదడుకు, పునరుత్పత్తి అవయవాలకు డైరెక్ట్ లింక్ ఉన్నందున ఒత్తిడి అనేది సంతానోత్పత్తి, స్పెర్మ్ కౌంట్‌ను ప్రభావితం చేస్తుందని తెలిసిన విషయమే. అయితే, వాయు కాలుష్యం వల్ల కలిగే నష్టాన్ని(కనీసం స్పెర్మ్ కౌంట్‌కు సంబంధించి) ఎలుకల మెదడులోని ఒక ఇన్‌ఫ్లమేషన్ మార్కర్‌ను తొలగించడం ద్వారా పరిష్కరించవచ్చని తాజాగా సైంటిస్టుల పరిశోధనలో తేలింది. కాగా సంతానోత్పత్తిపై వాయుకాలుష్య ప్రభావాలను నిరోధించే చికిత్సలను తాము అభివృద్ధి చేయగలమని UMSOM‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన జెకాంగ్ యింగ్ తెలిపారు.

ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ పర్స్‌పెక్టివ్స్ అనే సైన్స్ జర్నల్‌లో సెప్టెంబరులో ప్రచురించబడిన ప్రస్తుత అధ్యయనం.. గత దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా స్పెర్మ్ కౌంట్ తగ్గుదలకు మూలాలను కనుగొనడానికి ప్రయత్నించింది. మెదడులో ‘ఇన్హిబిటర్ కప్పా బి కినేస్ 2 లేదా ఐకెకె 2’ అని పిలువబడే ఇన్‌ఫ్లమేషన్ సంకేతాలు లేకుండా పెంచబడిన ఆరోగ్యకరమైన, సాధారణ ఎలుకలపై పరిశోధకుల బృందం అధ్యయనం చేసింది. వారు స్పెర్మ్ కౌంట్‌ను పరీక్షించే ముందు ఆరోగ్యకరమైన, IKK2 ఉత్పరివర్తన చెందిన ఎలుకలపై కలుషితమైన గాలి ప్రభావాన్ని అధ్యయనం చేశారు.

Next Story

Most Viewed