13 దేశాలతో చర్చిస్తున్నాం: హర్దిప్‌సింగ్ పురి

by  |
13 దేశాలతో చర్చిస్తున్నాం: హర్దిప్‌సింగ్ పురి
X

న్యూఢిల్లీ: విమాన సేవలను పరిమితంగా పునరుద్ధరించడానికి 13దేశాలతో చర్చలు జరుపుతున్నామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దిప్‌సింగ్ పురి తెలిపారు. ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్, న్యూజిలాండ్, నైజీరియా, బెహ్రెయిన్, ఇజ్రాయెల్, కెన్యా, ఫిలిప్పీన్స్, రష్యా, సింగపూర్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌లతో ఎయిర్ బబుల్ సదుపాయానికి చర్చిస్తున్నామని ట్వీట్ చేశారు.

ఈ చర్చలు ఆ దేశపౌరులతో పాటు అక్కడ చిక్కుకుపోయిన భారతీయులకు కలిసివస్తుందని వివరించారు. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్‌లతోనూ ఈ ప్రతిపాదనలు చేసినట్టు వెల్లడించారు. ఇప్పటికే యూఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ, ఖతర్, మాల్దీవులకు విమాన సేవలను కొనసాగిస్తున్నట్టు గుర్తుచేశారు.


Next Story