విజయవాడ టీడీపీలో మళ్లీ లొల్లి… కేశినేని నానిపై ఫైర్

by  |
ramana rao
X

దిశ, ఏపీ బ్యూరో: విజయవాడ టీడీపీలో మళ్లీ లొల్లి మెుదలైంది. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. వీరికి మరో నేత తోడయ్యారు. కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు ఎంపీ నానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ టీడీపీ పార్లమెంటు నియోజకవర్గంలో అనర్హులకు పదవులిచ్చారని మండిపడ్డారు. పార్టీ ముఖ్య నాయకులు తన పేరు సిఫార్సు చేసినా కొందరు అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించి తనకు పదవి రాకుండా చేశారని ధ్వజమెత్తారు. ఎంపీ కేశినేని నాని వల్ల పార్టీలో సీనియర్ నేతలకు అన్యాయం జరుగుతుందని రమణారావు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తాను పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశానని.. అయినా గుర్తింపు దక్కడం లేదన్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన తమలాంటి వారిని కాదని పార్టీలు మారి వచ్చినవారికి టీడీపీలో రాష్ట్ర స్థాయి పదవులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీని అవమానపరిచిన వారికి ప్రాధాన్యం ఇచ్చి సీనియర్లను మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడులు జోక్యం చేసుకోవాలని సూచించారు.

ఏం మగాడు.. ఏం మనిషి

చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, దేవినేని ఉమామహేశ్వరరావు ఓడిపోవాలి.. అక్కడ వేరే వాళ్లు గెలివాలి అని అంటారు. ఇదేక్కడి విధానం అని ఎరుబోతు రమణారావు ప్రశ్నించారు. అలాంటోడు ఏం మగాడు, ఏం మనిషి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తామని నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. బీసీ, ఎస్సీ వర్గాలకు టీడీపీలో సముచితస్థానం లేదన్న ఆయన త్వరలో మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే ఎక్కడికెళ్లారు..? దేవినేని ఉమాను అరెస్టు చేస్తే ఎందుకు మాట్లాడలేదు..? అని ఎంపీ కేశినేని నానిని ఎరుబోతు రమణారావు ప్రశ్నించారు.



Next Story

Most Viewed