నా కూతురు మేం కుదిర్చిన పెళ్లే చేసుకుంటుంది : షాహిద్ అఫ్రిది

by  |

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పెద్ద కూతురు అక్సా త్వరలో పెళ్లిపీఠలు ఎక్కబోతున్నది. పాకిస్తాన్ క్రికెటర్ షాహిన్ అఫ్రిదితో ఆమె పెళ్లి ఖరారు అయ్యింది. అయితే వీరిద్దరూ ప్రేమించుకున్నారని.. వీరిద్దరూ పెద్దలను కూడా ఎదిరించి పెళ్లి చేసుకోవడానికి సిద్దపడ్డట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వచ్చాయి. తమ పరువు పోతుందనే చివరకు ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి ఒప్పుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఈ విషయంపై షాహిద్ అఫ్రిది స్పందించారు. ‘షాహిన్, అక్సా రిలేషన్‌లో ఉన్నారనే విషయం పూర్తిగా అవాస్తవం.

అసలు తన కూతురికి, షాహీన్‌తో పరిచయం లేదు. ఇంతకు ముందు కూడా మాకు వారి కుటుంబంతో ఎలాంటి సంబంధాలు లేవు. ఇరు కుటుంబాలు కూడా భిన్న తెగలకు చెందినవి. కానీ, షాహీన్ కుటుంబం తన కూతురుని వారి కోడలుగా చేసుకోవడానికి ఆసక్తి చూపించడంతోనే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను’ అని అఫ్రిది అన్నాడు. నా కూతురు ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్నది. త్వరలోనే పీజీ కోసం విదేశాలకు వెళ్లనున్నది. ఇక షాహీన్ కూడా తన కెరీర్‌పై దృష్టి పెట్టాడు. అందుకే రెండేళ్ల తర్వాత పెళ్లి చేయడానికి నిశ్చయించామని అఫ్రిది జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story