ఆఫ్ఘన్ అభిమానుల దౌర్జన్యం.. అలా చేయొద్దన్న మహ్మద్ నబి

by  |
ఆఫ్ఘన్ అభిమానుల దౌర్జన్యం.. అలా చేయొద్దన్న మహ్మద్ నబి
X

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా శుక్రవారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ చూడటానికి వందల సంఖ్యలో టికెట్‌లేని ఆఫ్ఘనిస్తాన్ ఫ్యాన్స్ స్టేడియం వద్దకు వచ్చారు. అంతేకాకుండా స్టేడియం గేట్లు దూకి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో టికెట్లు కొన్న చాలా మంది ప్రేక్షకులు స్టేడియంలోకి వెళ్లే వీలు లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.

ఇక మ్యాచ్ జరిగే సమయంలో కొంత మంది ఆఫ్ఘన్ ఫ్యాన్స్.. పాకిస్తాన్ ఫ్యాన్స్‌తో ఘర్షణకు దిగారు. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడంతో దుబాయ్ పోలీసులు రంగంలోకి దిగి పదుల సంఖ్యలో అభిమానులను అరెస్టు చేశారు. దీనిపై ఐసీసీ కూడా విచారణ ప్రారంభించింది.

మ్యాచ్ అనంతరం ఆఫ్ఘన్ కెప్టెన్ మహ్మద్ నబి ఈ విషయాలపై స్పందించాడు. ఇకపై అభిమానులు టికెట్లు లేకుండా స్టేడియంకు రావద్దని కోరాడు. ఎవరైనా సరే టికెట్లు కొనుక్కొని మాత్రమే స్టేడియంకు రావాలని చెప్పారు. మరోవైపు టికెట్లు కొన్నా.. స్టేడియంలోకి రాలేకపోయిన వారికి బీసీసీఐ,ఈసీబీ క్షమాపణలు తెలిపాయి,



Next Story

Most Viewed