వ్యవసాయ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సులకు ప్రవేశాలు

by  |
Agricultural University
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిప్లమా కోర్సులకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. గుర్తింపు పొందిన ప్రైవేట్ కళాశాలలో సీట్ల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 26 నుంచి 3 డిప్లమా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రెండేళ్ల కోర్సులైన వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ డిప్లమా కోర్సులకు, 3 సంవత్సరాల కోర్సైన డిప్లమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పాలీసెట్ మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపులో చేపట్టనున్నారు.

మొత్తం సీట్లలో 60 శాతం గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులకు కేటాయించనున్నారు. ఈ సీట్లు పొందేందుకు విద్యార్థులు 10 సంవత్సరాల చదువు కాలంలో నాలుగు సంవత్సరాలు ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదివి ఉండాలని నిబంధనలు విధించారు. విద్యార్థులు చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిచే ధ్రువీకరణ పత్రాన్ని ఆన్లైన్ లో పొందుపరచాల్సిందిగా సూచించారు. మిగతా 40శాతం సీట్లను పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఈ కోటలోని సీట్లను గ్రామీణ ప్రాంత అభ్యర్థులతో పాటు పట్టణ అభ్యర్థులు కూడా అవకాశం కల్పించారు. కౌన్సెలింగ్ తేదీలను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రకటించనున్నారు.


Next Story

Most Viewed