డ్రగ్స్ తీసుకుని 2,300 మంది మృతి

by  |
డ్రగ్స్ తీసుకుని 2,300 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : గడిచిన మూడేళ్లలో డ్రగ్స్ తీసుకోని దేశ వ్యాప్తంగా 2,300 మంది మృతిచెందినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో పేర్కొంది. ఆ గణాంకాల ప్రకారం 2017-19 సంవత్సరాల మధ్యలో ఈ మరణాలు సంభవించాయని వివరించింది. మృతుల్లో అధికంగా 30-45 సంవత్సరాల వయస్సున్న వారే అధికంగా ఉన్నారని, ఆ వయసు వారే 784 మంది మృత్యువాత పడ్డట్టు ఆ గణాంకాల ద్వారా తెలుస్తోంది.

డ్రగ్స్ అధిక మోతాదులో తీసుకోవడం ద్వారా 2017 మొత్తం 745 మంది మరణించగా.. 2018లో 875 మంది, 2019లో 704 మంది చనిపోయారు. వీటిల్లో రాజస్థాన్‌లో అత్యధిక మరణాలు 338 కాగా, కర్ణాటక 239, ఉత్తర ప్రదేశ్ 236 కేసులు ఉన్నాయి. 14 ఏండ్లకంటే తక్కువ వయసున్న 55 మందిని ఈ డ్రగ్స్ కబలించింది. 14-18 ఏండ్లున్న 70 మంది పిల్లలు మరణించారు. 18-30 ఏళ్లున్న వారు 624 మంది, 45-60 వయస్సు వారు 550 మంది, 60, అంతకంటే ఎక్కువ వయస్సు వారు 241 మంది డ్రగ్స్ అధిక అధిక మోతాదు కారణంగా చనిపోయారు.

మాదకద్రవ్య దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్ర న్యాయ శాఖ ఇటీవల 272 జిల్లాల కోసం ‘నషా ముఖ్ భారత్ అభియాన్’ (ఎన్‌ఎంబిఎ) ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మూడు ప్రయోజనాలను ఆ శాఖ ఆశిస్తోంది. మాదకద్రవ్యాల బ్యూరోతో కలిసి పని చేయడం, డ్రగ్స్ బాధితులకు న్యాయ సహాయం అందించడంతోపాటు అవగాహన కల్పించడం, వారికి వైద్య చికిత్సలు అందించడం దీని ముఖ్య ఉద్దేశం. మాదకద్రవ్యాల డిమాండ్ తగ్గింపు కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్‌ఎపిడిడిఆర్) కింద ఎన్‌ఎమ్‌బిఎ మరింత బలోపేతం అవుతుందని, దీని కింద 272 జిల్లాల్లోని 13,000 మంది యువ వాలంటీర్లకు మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా కమ్యూనిటీ మొబిలైజర్‌లుగా శిక్షణ ఇస్తామని ఎన్‌ఎంబిఎలోని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌ఎపిడిడిఆర్ కింద సుమారు 11.80 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు.

మాదకద్రవ్య దుర్వినియోగ సమస్యను పరిష్కరించడానికి నిపుణులు దీర్ఘకాలిక ఇంటెన్సివ్ చికిత్స, పునరావాసం గురించి ప్రభుత్వం పరిశీలించాలని అంతర్జాతీయ చికిత్స సన్నాహక కూటమిలోని భాగమైన దక్షిణాసియా ప్రాంతీయ సమన్వయకర్త లూన్ గాంగ్టే అన్నారు.

“పునరావాసం తరువాత ఏమి జరుగుతుందో చూసుకోవాలి. పునరావాసం తరువాత, 80-90 శాతం మంది తిరిగి వ్యసనం లోకి వస్తారు కాబట్టి, దాని కోసం ఒక ప్రణాళిక ఉండాలి. పునరావాసానికి మించి ప్రభుత్వం ఆలోచించాలి. బాధితులకు తప్పనిసరిగా ఉపాధి కల్పించాలి. ఇది వారి మైండ్‌ను డైవర్ట్ చేయడానికి సహాయపడుతుంది “అని లూన్ గ్యాంగ్టే చెప్పారు.

HYDలో మరోసారి డ్రగ్స్ కలకలం..

Next Story

Most Viewed