అప్పుల్లో ఉన్న రియల్టీ సంస్థను కొనే ఆలోచనలో అదానీ గ్రూప్

by  |
aadani1
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ అదానీ గ్రూపునకు చెందిన రియల్ ఎస్టేట్ విభాగం ప్రముఖ హౌసింగ్ డెవలెప్‌మెంట్ సంస్థ ఓజోన్ గ్రూప్‌ను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వర్గాల ప్రకారం.. బెంగళురు కేంద్రంగా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ ఓజోన్ గ్రూపును 1 బిలియన్ డాలర్లకు అంటే సుమారు రూ. 7,55 కోట్లకు కొనేందుకు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అయితే, దీనిపై ఇరు సంస్థలు అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. ఓజోన్ గ్రూప్ ప్రస్తుతం అప్పుల్లో ఉంది. సుమారు రూ. 6 వేల కోట్ల రుణ భారాన్ని ఎదుర్కొంటున్న ఈ సంస్థ చెన్నై, బెంగళూరు నగరాల్లో భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పటివరకు ఈ సంస్థ 1.35 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలను పూర్తి చేసింది. భవిష్యత్తులో పూర్తి చేయాల్సిన 4 కోట్ల చదరపు అడుగుల ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ ఒప్పందానికి సంబంధించి చర్చల దశలోనే ఉందని, ఖరారైతే ఓజోన్ గ్రూపునకు ఉన్న అప్పులను అదానీ సంస్థ స్వీకరించవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, అదానీ గ్రూప్ అనుబంధ రియల్టీ విభాగం ఇప్పటివరకు దేశంలోని మొత్తం 6.9 కోట్ల చదరపు అడుగుల ప్రాజెక్టులను నిర్వహిస్తోంది.



Next Story

Most Viewed