అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీ నుంచి అదానీ పోర్ట్స్ తొలగింపు!

by  |
అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీ నుంచి అదానీ పోర్ట్స్ తొలగింపు!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాకు చెందిన స్టాక్ ఎక్స్ఛేంజీ ఎస్ అండ్ పీ డౌజోన్స్ భారత్‌కు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్‌ను లిస్టింగ్ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. మయన్మార్ మిలిటరీతో వ్యాపార సంబంధాలను కలిగి ఉన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అదానీ పోర్ట్స్ కంపెనీ యంగూన్‌లో ఓ రేవును నిర్మిస్తోంది. అలాగే మయన్మార్ ఎకనమిక్ కార్పొరేషన్(ఎంఈసీ) నుంచి భూమిని లీజుకు తీసుకుంది. దీనిపై అదానీ గ్రూప్ స్పందించలేదు. ఎంఈసీ నుంచి భూమిని లీజుకు తీసుకున్న అంశంపై అదానీ గ్రూప్ మార్చిలో స్పందించింది. ఈ ఒప్పందానికి సంబంధించి భాగస్వామ్యంపై చర్చించనున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 1న మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా, బ్రిటన్ దేశాలు మయన్మార్ ఎకనమిక్ హోల్డింగ్స్ పబ్లిక్ కంపెనీ లిమిటెడ్, మయన్మార్ ఎకనమిక్ కారిడార్‌లపై ఆంక్షలను విధిస్తున్నాయి. అదేవిధంగా అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్‌ను గురువారం ట్రేడింగ్ జాబితా నుంచి తొలగించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.



Next Story

Most Viewed