రోడ్డుపై టిఫిన్ సెంటర్ వద్ద అడిషనల్ కలెక్టర్.. ఇలా చేయాలని సూచన

by  |
Collector-Jainith1
X

దిశ, మొయినాబాద్: యువత స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపి స్వశక్తితో ఉన్నత శిఖరాలను అధిగమించవచ్చని అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్ అన్నారు. బుధవారం మొయినాబాద్ మండల కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్ నిధులతో స్వయం ఉపాధి కల్పించుకుని వ్యాపారం నిర్వహిస్తున్న శ్రీనివాస్ మొబైల్ టిఫిన్ సెంటర్ ను ఆయన పరిశీలించారు. లబ్ధిపొందిన విధానం, రోజూ వచ్చే ఆదాయం వివరాలను యజమానిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులందరూ దరఖాస్తు చేసుకుని.. వారి అభిరుచులకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు సమకూర్చుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. నిరుద్యోగులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని యువతకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. దీంతో సమాజంలో గౌరవం, ఆర్థిక అభివృద్ధికి చక్కటి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చన్నారు. ఆయన వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రవీణ్, ఇతర అధికారి తిరుపతి రావు, లబ్ధిదారులతోపాటు తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed