టాలీవుడ్‌పై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

by  |
టాలీవుడ్‌పై మాధవీలత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ నటి మాధవీలత తెలుగు ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ… టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరుగవని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా టాలీవుడ్‌పై తెలంగాణ ఎన్సీబీ అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. సుశాంత్ కేసులో ఎన్సీబీ అడుగుపెట్టడాన్ని స్వాగతిస్తూనే… టాలీవుడ్‌పై దృష్టి పెట్టాలని కోరింది. బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉన్నమాట వాస్తవమే అన్నారు. తెలుగు ఇండస్ట్రీలో సైతం డ్రగ్స్ వాడకం ఎక్కువ ఉందని మాధవీలత వెల్లడించారు. కాగా ఆమె తెలుగులో నచ్చావులే, స్నేహితుడా అనే పలు సినిమాల్లో నటించారు.

Next Story

Most Viewed