తెలంగాణ ‘జైభీం’ కేసును సుమోటోగా విచారణ చేయాలి.. యూత్ ఫర్ యాంటి కరప్షన్ ఫిర్యాదు..

by  |
తెలంగాణ ‘జైభీం’ కేసును సుమోటోగా విచారణ చేయాలి.. యూత్ ఫర్ యాంటి కరప్షన్ ఫిర్యాదు..
X

దిశ, మణుగూరు : సూర్యాపేట ఆత్మకూరు మండలంలో గూగులోతు వీరశేఖర్ అనే గిరిజన వ్యక్తి పై పోలీసులు కస్టడీలో టార్చర్ చేసినట్లుగా వస్తున్న వార్తా కథనాలపై చర్యలను తీసుకోవాలని భద్రాద్రి జిల్లా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థకు చెందిన లా విద్యార్థి నల్లపు మణిదీప్ మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శుక్రవారం పినపాక మండలంలోని ఆయన నివాసంలో దిశ విలేకరితో మాట్లాడుతూ.. వీరశేఖర్ అనే యువకుడు మోటర్లు దొంగలించాడని తప్పుడు నెపంతో థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలకు గురిచేసిన ఆత్మకూరు ఎస్ఐ పై హత్యానేరం, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఉన్నా, ఈ విషయాల పట్ల ఉన్నత న్యాయస్థానాలు పదే పదే ఆగ్రహం వ్యక్తం చేసినా మళ్ళీ ఇలాంటి సంఘటలు జరగడం బాధాకరమన్నారు. ఇప్పటికే బలహీన వర్గాల ప్రజలు ఏ కేసుల్లో వచ్చామో కూడా తెలియకుండా జైళ్లలో మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజ నిర్ధారణ చేసి అన్యాయంగా అక్రమంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్.ఐ పై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంఘటన పై పూర్తి విచారణ కోసం హై కోర్టును ఆశ్రయిస్తాం అని ఆయన తెలిపారు.

Next Story

Most Viewed