ఏసీపీ జయరాం ఇంత వ్యవహారం నడిపాడా!

by  |
ఏసీపీ జయరాం ఇంత వ్యవహారం నడిపాడా!
X

దిశ, వెబ్‌డెస్క్: వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెన్షన్ కేసులో కొత్తకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. 140 ఎకరాల దాచారం భూమి వివాదంలో బాధితులను ఏసీపీ జయరాం బెదిరించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా, సానాసతీష్ అనుచరులతో ఏసీపీ చేతులు కలిపి తమను ఇబ్బందులకు గురిచేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో మోయిన్ ఖురేషీ సీబీఐ కేసులో సానాసతీష్ నిందితుడు అనే విషయం తెలిసిందే.

ఇతను సీబీఐ అధికారులకే లంచం ఇవ్వజూపాడు. ఇదిలాఉంటే.. సర్వే నెంబర్ 81 నుంచి 90వరకు ఉన్న భూమి వివాదంలో ఉంది. ఈ సర్వే నెంబర్లలో గల 400 ఎకరాల్లో 140 ఎకరాలకు సంబంధించి సానా సతీష్, మరోవర్గానికి మధ్య వివాదం నడుస్తోంది. అదే సయమంలో ఇరువర్గాల నుంచి బాధితులు భూమిని కొనుగోలు చేశారు.

ఈ క్రమంలోనే బాధితులపై తప్పుడు కేసులు నమోదు చేసి ఏసీపీ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితులు రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో ఏసీపీ జయరాం వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణకు ఆదేశించిన డీజేపీ మహేందర్ రెడ్డి.. నివేదిక రాగానే ఆయన్ను సస్పెండ్ చేశారు. అలాగే, సానాసతీష్ వివాదంలో విచారణకు స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ వివాదంలో బాధితులంతా రాచకొండ కమిషనరేట్‌కు చేరుకున్నారు. కాగా, స్పెషల్ టీమ్ అధికారులు వారిని విచారిస్తున్నారు.


Next Story