సాతంరాయ్ లో పోలీసుల కార్డెన్ సెర్చ్..

by  |
సాతంరాయ్ లో పోలీసుల కార్డెన్ సెర్చ్..
X

దిశ ,రంగా రెడ్డి ,రాజేంద్రనగర్ : మత్తు పదార్థాలు ఎవరు అమ్మినా, తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని శంషాబాద్ ఏసిపి భాస్కర్ గౌడ్ హెచ్చరించారు. గంజాయి, గుట్కా లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారన్న పక్కా సమాచారంతో గురువారం రాత్రి ఆర్జీఐఏ ఇన్ స్పెక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శంషాబాద్ ఏసిపి భాస్కర్ గౌడ్ సాతంరాయ్ రాజీవ్ గృహకల్పన 24 బ్లాకులలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేని 16 బైకులు, ఒక కారును సీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ.. జల్సాలకు అలవాటుపడి గంజాయి, గుట్కా లకు యువత బానిసలు అవుతున్నారని, అందుకే నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎవరైనా మత్తుపదార్థాలు అమ్మినా, అనుమానాస్పదంగా కనిపించినా, పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. అపరిచితులకు ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వకూడదని సూచించారు. ఇలాంటి కార్డెన్ సెర్చ్ నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.


Next Story

Most Viewed