ఏసీబీ వలలో పంచాయతీరాజ్‌ డీఈ

by  |
Jawahar-Nagar-Municipal-Cor
X

దిశ, జవహర్ నగర్: జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి అడ్డాగా మారింది. ‘‘మనం తలుచుకుంటే డబ్బులు కరువా?’’ అన్నట్లు నిత్యం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా.. జవహర్‌నగర్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం జరిగిన ఏసీబీ దాడులే నిదర్శనం. వివరాళ్లోకి వెళితే.. కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనుల కోసం కాంట్రాక్టర్ స్వామికి రూ. 50 లక్షల విలువైన కాంట్రాక్ట్ దక్కింది. దీనికి గాను డిప్యూటీ ఇంజినీర్(డీఈ) కృష్ణతో పాటు అసిస్టెంట్ భరత్‌‌కు కాంట్రాక్టర్ స్వామికి రూ.50 లక్షల కాంట్రాక్ట్‌ పనులకుగాను లంచంగా రూ. 96వేలు ఒప్పందం కుదుర్చుకున్నారు. గత మూడ్రోజుల క్రితం రూ.20వేలు కాంట్రాక్టర్ స్వామి అధికారులకు ఇచ్చారు.

మిగిలిన బ్యాలెన్స్‌లో గురువారం రూ.30 వేలు డీఈ కృష్ణకు, రూ.20 వేలు అసిస్టెంట్ భరత్‌కు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టబడ్డారు. అయితే.. అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించేందుకు కాంట్రాక్టర్ స్వామి పక్కా పథకం ప్రకారం.. ముందస్తుగా ఏసీబీకి సమాచారం అందించడంతో అవినీతి అధికారులను రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి మరిన్ని సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ అధికారి సత్యనారాయణ తెలిపారు.


Next Story