ట్రైన్ ప్రయాణికులకు ‘ఆరోగ్య సేతు’ తప్పనిసరి

by  |
ట్రైన్ ప్రయాణికులకు ‘ఆరోగ్య సేతు’ తప్పనిసరి
X

న్యూఢిల్లీ: ఈ రోజు(మంగళవారం) సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ రాజధాని ట్రైన్‌లలో ప్రయాణించేవారు తప్పకుండా ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. సోమవారం రాత్రి రైల్వే మంత్రిత్వ శాఖ ఈ మేరకు ట్వీట్ చేసింది. రైలు ప్రయాణానికి సంబంధించి కేంద్రం జారీ చేసిన సూచనల్లో ప్రయాణికులు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆదేశించలేదు. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచనలు మాత్రమే చేసింది. కానీ, సోమవారం అర్ధరాత్రి రైల్వే శాఖ.. ఓ ట్వీట్‌తో ఈ యాప్‌ను ప్రయాణికులకు తప్పనిసరి చేసింది. దీంతో రైల్వే అధికారుల్లోనే ఈ నిర్ణయంపై గందరగోళం నెలకొంది. ఈ ట్వీట్ గురించి ఇంకా తమకు సమాచారం అందలేదని రైల్వేస్ జోనల్ స్థాయిలోని పలువురు అధికారులు తెలిపారు. ప్రయాణికుల పరిస్థితి ఇలాగే ఉన్నది. అయితే, కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు రైల్వే స్టేషన్‌కు 90 నిమిషాలు ముందుగా వచ్చిన ప్రయాణికులను.. అక్కడే.. అప్పుడే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆదేశించనున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి.

Next Story

Most Viewed