‘విషపూరిత నురగ’ ఆ రెండు రాష్ట్రాలు ఢిల్లీకి ఇచ్చిన బహుమతి : ఆప్ ఎమ్మెల్యే

by  |
‘విషపూరిత నురగ’ ఆ రెండు రాష్ట్రాలు ఢిల్లీకి ఇచ్చిన బహుమతి : ఆప్ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీని ఆనుకుని ఉన్న యుమునా నదిలో విషపూరిత నురగ లెవల్ క్రమంగా పెరుగుతోంది. ప్రపంచ ప్రఖ్యాత కట్టడమైన తాజ్‌మహల్ యుమునా నది ఒడ్డునే ఉన్నది. అయితే, యమునా నదిలో విషపు నురుగ పర్సంటేజీ క్రమంగా పెరుగుతుండటంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నదిలోని నీటిని ఉపయోగిస్తే తప్పకుండా అనారోగ్యం బారిన పడక తప్పదని, ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆప్ ఎమ్మెల్యే రాఘవ చదా విషపూరిత నురగపై స్పందించారు.

‘యమునా నది ఉపరితలంపై తేలియాడుతున్న విషపూరిత నురుగ ఢిల్లీకి యూపీ, హర్యానా ప్రభుత్వాలు ఇచ్చిన బహుమతి’ అని అన్నారు. ‘హర్యానాలోని యమునా నది నుంచి సుమారు 105 MGD (రోజుకు మిలియన్ గ్యాలన్లు) వ్యర్థ జలాలు, యూపీలోని గంగా నది నుంచి 50 MGD వ్యర్థ జలాలు ఓఖ్లా బ్యారేజీలో కలుస్తున్నాయని పేర్కొన్నారు. ఆ బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేసిన క్రమంలో ఆ విషపూరిత నురగ ఢిల్లీలోని యుమునా నదిలో కలిసిపోయి కలుషితం అవుతున్నాయని వివరించారు.

Next Story

Most Viewed