నల్లాలకు ఆధార్​ సీడింగ్​ : సీఎస్

by  |
నల్లాలకు ఆధార్​ సీడింగ్​ : సీఎస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మెరుగైన తాగునీటి సరఫరా కోసం వినియోగదారుల PTIN, CAN నంబర్లతో ఆధార్ సీడింగ్ ను పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్​కుమార్​ ఆదేశించారు. ఇప్పటి వరకు నీటి సరఫరా కాని ప్రాంతాలు, మురికివాడల్లోని ఇండ్లకు తాగునీటి సరఫరా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్ ను ఆదేశించారు.

మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ దానకిషోర్, జీఎంహెచ్ సీ కమిషనర్ లోకేశ్ కుమార్, మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ డా.యన్.సత్యనారాయణలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం బీఆర్కే భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్​ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్ లో ఉచిత మంచి నీటి సరఫరా ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డబుల్​బెడ్​రూం ఇండ్ల నిర్మాణాలు మౌలిక వసతులతో సహా వేగంగా పూర్తి చేయడానికి తగిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ వార్డుల్లో ట్రీ పార్కులు అభివృద్ధి పరచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్​కుమార్​ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Next Story

Most Viewed