హెల్త్ ​ప్రొఫైల్‌కు ఆధార్ చిక్కులు..!

by  |
Health Profile
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న హెల్త్ ప్రొఫైల్​ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆధార్​ తప్పనిసరి చేసింది. ఆ కార్డు ఉంటేనే హెల్త్​ప్రోఫైల్‌లో పరీక్షలు చేయనున్నట్లు సెక్రటేరియట్‌లోని ఓ ఉన్నతాధికారి ‘దిశ’కు తెలిపారు. అయితే ఆ వివరాలను గోప్యంగా ఉంచేందుకు సర్కార్‌కు సవాల్‌గా మారనుంది. సాంకేతికంగా భద్రపరుస్తున్న ఆ డేటా విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా, ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు వస్తాయని ఆందోళన చెందుతున్నది. ఈక్రమంలో లీగల్ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉన్నట్లు వైద్యశాఖలోనే చర్చ జరుగుతున్నది. దీంతో డేటా స్టోరేజ్ పకడ్భందీగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నది. దీని కొరకు ఐటీ నిపుణుల సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు.

ఫైలట్ ప్రాజెక్టుగా రాజన్న సిరిసిల్లా, ములుగు జిల్లాల్లో ప్రారంభించనున్నారు. ఈ మేరకు రెండు జిల్లాలు కలిపి 365 టీమ్‌లు ప్రొఫైల్ ప్రాజెక్టులో పనిచేయనున్నారు. ప్రతీ టీమ్‌లో ఒక ఏఎన్ఎం, ఇద్దరు ఆశాలు ఉండనున్నారు. 90 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని వైద్యశాఖ లక్ష్యం పెట్టుకున్నది. ఒక్కో జిల్లాలో టెస్టులకు కొరకు 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. ఇప్పటికే టెస్టులకు కావాల్సిన పరికరాలు, వాటిలో వినియోగించే రసాయనాలను టీఎస్ఎంఎస్​ఐడీసీ సంస్థ సమకూర్చింది.

ప్రతి వ్యక్తి డేటా సేకరణ..

ప్రజల ఆరోగ్య పరిస్థితి అరచేతిలోనే ఉంచేందుకు ప్రభుత్వం టెక్నాలజీని వినియోగించుకొని పబ్లిక్ హెల్త్ కండీషన్‌ను డిజిటల్ రూపంలో పొందుపరచనుంది. ఈ మేరకు రాష్ర్టంలోని ప్రతి వ్యక్తి హెల్త్ పరిస్థితిపై సర్కార్ ఆరా తీయనుంది. ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించనుంది. తర్వాత పూర్తి వివరాలతో కూడిన ప్రత్యేకమైన కార్డును రూపొందించనుంది. ఈ ప్రొఫైల్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసి, ప్రతి వ్యక్తి వివరాలను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయనున్నారు.

సర్వేలో పరీక్షించేవి…

హెల్త్ ప్రొఫైల్‌ను రెండు విభాగాలుగా నిర్వహించనున్నారు. మొదటి రౌండ్‌లో బీపీ, షుగర్, రక్తంలో హిమోగ్లోబిన్, బరువు, ఎత్తు, ప్రాథమిక కంటి, పంటి పరీక్షలు, గుండె, ఊపిరితిత్తుల పనితీరు పరిశీలన, ఆక్సిజన్, శ్వాసరేట్, జ్వర పరీక్షలను నిర్వహించనున్నారు. అంతేగాక ప్రతి రోజూ పౌష్ఠికాహారం ఏ మేరకు తీసుకుంటున్నారు? అనే అంశాలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ పరీక్షల అనంతరం హైరిస్క్ గ్రూప్‌కు చెందిన వ్యక్తులను గుర్తించనున్నారు. తర్వాత వారిని స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తారు.

సెకండ్ రౌండ్‌లో ఇలా…

రక్తంలోని హిమోగ్లోబిన్, తెల్లరక్తకణాలు, ప్లేట్ లెట్స్ కౌంట్, గ్లూకోజ్ శాతం, కొలెస్ర్టాల్, కిడ్నీ, లివర్, గుండె అంతర్గత పనితీరు టెస్టులు, హార్ట్ రేట్, ఈసీజీ, ఆక్సిజన్ సాచ్యురైజేషన్, రెటీనా ఎవల్యూషన్, చెవుల పనితీరు, చర్మం నాణ్యత తెలుసుకునేందుకు స్కీన్ పరీక్షలు, డెంటల్, చిగుర్ల పరిస్థితి కొరకు ప్రత్యేకమైన డిజిటల్ పరీక్షలు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పరీక్షలన్నీటి కొరకు యంత్రాలను కూడా రెడీ చేశారు.

ప్రాజెక్టు ఇలా.. (ఒక్కో జిల్లాకు 90 రోజులు)

అంశాలు రాజన్నసిరిసిల్లా ములుగు
18పైబడినవారు 3,80,905 2,60,620
1ఏఎన్ఎం,2ఆశాలు(టీమ్) 212 153
టెస్టింగ్​ కేంద్రాలు 15పీహెచ్​సీలు 15పీహెచ్​సీలు



Next Story

Most Viewed