మహిళ హత్యకు దారి తీసిన భూ విక్రయం

63

దిశ, వెబ్‌డెస్క్: భూ విక్రయం మహిళ హత్యకు దారి తీసింది. ఈ దారుణ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. బాలానగర్‌ మండలం మాచారం వద్ద నర్సింహులు అనే వ్యక్తి భూ విక్రయంలో తమ వాటా ఇవ్వలేదని యాదయ్య కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం యాదయ్య బైక్‌ను వ్యాన్‌తో తొక్కించాడు. వ్యాన్‌తో తొక్కించడంతో యాదయ్య భార్య శైలజ అక్కడికక్కడే మృతి చెందారు. యాదయ్యతో పాటు కూతురు నిహారికకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వ్యాన్‌ను వదిలేసి నర్సింహులు పరారయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితులను మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వ్యాన్‌లో వేటకొడవలి, కత్తులను స్వాధీనం చేసుకున్నారు.