బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా యాప్‌పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్‌బీఐ

by Dishanational1 |
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా యాప్‌పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన యాప్‌పై ఆర్‌బీఐ ఇటీవల ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా వాటిని ఎత్తివేస్తున్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) వెల్లడించింది. ఈ నిర్ణయంతో బ్యాంకుకు భారీ ఊరట లభించింది. దీని ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు సెంట్రల్ బ్యాంక్ అనుమతి ఇచ్చిందని బ్యాంక్ ఆఫ్ బరోడా బుధవారం ప్రకటనలో పేర్కొంది. మొబైల్ అప్లికేషన్‌లో కొన్ని లోపాలు ఉన్న కారణంగా 2023, అక్టోబర్‌లో ఆర్‌బీఐ కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆంక్షలు విధించింది. సుమారు 7 నెలలుగా బ్యాంకు తన యాప్‌లో కొత్త వినియోగదారులను చేర్చుకోలేదు. ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా సమస్యలను సరిదిద్దాం. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో స్పష్టం చేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆర్‌బీఐ వెల్లడించింది. ఇదే సమయంలో ఇకమీదట ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి నడుకోనున్నట్టు తెలిపింది.

Next Story