హైదరాబాద్‌లో కుప్పకూలిన చారిత్రక భవనం

by  |
హైదరాబాద్‌లో కుప్పకూలిన చారిత్రక భవనం
X

దిశ, మలక్‌పేట్: మలక్‌పేట మార్కెట్ ఆవరణలోని చారిత్రక భవనం మహబూబ్ మాన్షన్‌లో కొంత భాగం కుప్పకూలింది. గత మూడు రోజులుగా ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పురాతన భవనం కూలిందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అధికారులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

మహబూబ్ మాన్షన్ చరిత్ర..

మహబూబ్ మాన్షన్ భవనం 6వ నిజాం నవాబు మహబూబ్ అలీ ఖాన్ 19వ శతాబ్దం చివరలో నిర్మించారు. ఆ భవనం సాంప్రదాయ ఐరోపా, మొఘల్ శైలిలో నిర్మించబడింది. కింగ్ కోఠి ప్యాలెస్‌లోని ముబారక్ మాన్షన్‌కు తూర్పు బ్లాక్ మాదిరిగా ఈ భవనం నిర్మించారు.



Next Story