UNION BUDGET-2024: మొబైల్ యూజర్లకు శుభవార్త.. ఫోన్లు, స్పేర్ పార్ట్స్‌పై దిగుమతి సుంకం తగ్గింపు

by Disha Web Desk 1 |
UNION BUDGET-2024: మొబైల్ యూజర్లకు శుభవార్త.. ఫోన్లు, స్పేర్ పార్ట్స్‌పై దిగుమతి సుంకం తగ్గింపు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక‌సభ వేదికగా మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. మొబైల్ ఫోన్ల ఉత్పత్తి, వాటి విడిభాగాల భాగాలపై దిగుమతి సుంకాన్ని దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సిమ్ సాకెట్లు, మెటల్ భాగాలు, సెల్యులార్ మాడ్యూల్స్, ఇతర మెకానికల్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 5 శాతం తగ్గించనున్నట్లు పేర్కొంది. మిడిల్ కవర్, మెయిన్ లెన్స్, బ్యాక్ కవర్, జీఎస్‌ఎం యాంటెన్నా, పీయూ కేస్, సీలింగ్ గాస్కెట్, సిమ్‌ సాకెట్, స్క్రూలు, ఇతర ప్లాస్టిక్, మెటల్ మెటీరియల్‌లపై కూడా దిగుమతి సుంకాన్ని కేంద్రం తగ్గిస్తున్నట్లు నిర్మల ప్రకటించారు. ఈ నిర్ణయంతో దేశంలో మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేసే కంపెనీలకు భారీ ఊరట లభించనుంది. దీంతో ఫోన్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

Next Story

Most Viewed