నిజామాబాద్ BJP అభ్యర్థిని మార్చాల్సిందే.. అధిష్టానానికి సొంత నేతల విజ్ఞప్తి

by Disha Web Desk 2 |
నిజామాబాద్ BJP అభ్యర్థిని మార్చాల్సిందే.. అధిష్టానానికి సొంత నేతల విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ బీజేపీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు టికెట్ కేటాయించడంపై సొంత నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అర్వింద్‌ను కొనసాగించడానికి వీళ్లేదని.. అభ్యర్థిని తీరాల్సిందే అని అధిష్టానానికి వరుస విజ్ఞప్తులు చేస్తున్నారు. ముఖ్యంగా మీసాల శ్రీనివాస్, కార్పొరేటర్ మీసాల సవిత అర్వింద్‌కు టికెట్ కేటాయించడంపై అసంతృప్తిగా ఉన్నారు. నిజామాబాద్ నుంచే కాదని.. అసలు లోక్‌‌సభ బరిలో ఉండటానికి అర్వింద్ అనర్హుడు అని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజామాబాద్ అభ్యర్థిత్వంపై జాతీయ నాయకత్వం మరోసారి పునరాలోచించాలని విజ్ఞప్తులు చేశారు. ఎంత నిర్లక్ష్యం చేస్తే.. క్షేత్రస్థాయిలో పార్టీకి అంత నష్టం జరుగుతుందని.. అర్వింద్‌ను కొనసాగిస్తే మాత్రం ఓడిపోవడం ఖాయమని తేల్చి చెబుతున్నారు.

అంతేకాదు.. ఇటీవల అర్వింద్‌కు టికెట్ ఇవ్వొద్దంటూ మెట్‌పల్లి, కోరుట్లలో కరపత్రాలు వెలిసిన విషయం తెలిసిందే. ‘కండ్లకు పెట్టుకున్న కూలింగ్ అద్దాలు తియ్యడు.. ప్రజలను చూడడు.. కారు నుంచి దిగడు.. ప్రజలతో మాట్లాడడు’ అని ఆ కరపత్రాల్లో పొందుపరిచారు బీజేపీ నేతలు. దీంతో ఒక్కసారిగా నియోజకవర్గ బీజేపీలో పరిస్థితులు గందరగోళంగా మారాయి. అధిష్టానం పునరాలోచిస్తుందో లేదో చూడాలి. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ధర్మపురి అర్వింద్‌కు నిజామాబాద్‌ ఎంపీ టికెట్ కేటాయించారు.


Next Story