పొత్తుపై కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫస్ట్ రియాక్షన్

by Disha Web Desk 2 |
పొత్తుపై కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫస్ట్ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీ పొత్తు పెట్టుకున్నాయి. ఈ విషయాన్ని ఇవాళ ఇరు పార్టీల అధినేతలు కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. చర్చల అనంతరం మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌తో రాజ్యాంగానికి ముప్పు ఉందని అన్నారు. ఈ రెండు పార్టీల నుంచి దేశాన్ని రక్షించేందుకే పొత్తు పెట్టుకున్నామని అన్నారు. రేపు బీఎస్పీ చీఫ్ మాయావతితో మాట్లాడుతానని తెలిపారు. సీట్లు కేటాయింపులు, విధివిధాలను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణను కాపాడేందుకే పొత్తు పెట్టుకున్నామని అన్నారు. వాస్తవంగానే కాంగ్రెస్, బీజేపీతో రాజ్యాంగానికి ముప్పు పొంచిఉందని అభిప్రాయపడ్డారు. మాయవతితో మాట్లాడిన తర్వాతే పొత్తు ప్రతిపాదన పెట్టినట్లు తెలిపారు.

Next Story