అమిత్ షా సభకు దూరంగా ఉన్న రాజాసింగ్.. కారణం అదేనా?

by Disha Web Desk 2 |
అమిత్ షా సభకు దూరంగా ఉన్న రాజాసింగ్.. కారణం అదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీ నేతలు స్పీడు పెంచారు. ప్రచారానికి అగ్రనేతలను రాష్ట్రానికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇవాళ రాష్ట్రంలో అమిత్ షా పర్యటించగా.. ప్రధాని మోడీ టూర్ కూడా ఖరారైంది. మొత్తం 12 పార్లమెంట్ సెగ్మెంట్లలో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ పెద్దలు ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపు గుర్రాలనే బరిలోకి దింపుతున్నారు. ఈ క్రమంలోనే సికింద్రబాద్‌ వేదికగా బీజేపీ సోషల్ మీడియా టీమ్‌తో అమిత్ షా సమావేశమై కీలక సూచనలు చేశారు. అనంతరం బీజేపీ ముఖ్య కార్యకర్తలతో ఎల్బీ స్టేడియంలో సమావేశమై దిశానిర్ధేశం చేశారు. అయితే అమిత్ షా సభకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజారుకాకపోవడం ఆ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది.

సికింద్రాబాద్ సోషల్ మీడియా టీమ్ మీటింగ్‌తో పాటు స్వయంగా గోషామాహల్ నియోజకవర్గ పరిధిలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సమ్మేళన సభకు స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ హాజరు కాలేదు. అంతేకాదు.. ఇటీవల గోషామాహల్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి నిర్వహించిన విజయ సంకల్ప యాత్రకు కూడా రాజాసింగ్ దూరంగా ఉన్నారు. హైదరాబాద్‌ పార్లమెంట్ అభ్యర్థిగా మహిళను ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. ఈ పరిణామాలు పార్టీ సొంత నేతలను షాక్‌కు గురిచేస్తున్నాయి. రాజాసింగ్ దూరంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. వెంటనే ఆయనతో చర్చించి స్పీడు పెంచేలా చేయాలని కోరుతున్నారు.


Next Story