IPL 2023: గ్రౌండ్‌లో గొడవ పడితే బ్యాన్ చేయాలి.. కోహ్లీ, గంభీర్‌ ఘటనపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఫైర్

by Disha Web Desk 13 |
IPL 2023: గ్రౌండ్‌లో గొడవ పడితే బ్యాన్ చేయాలి.. కోహ్లీ, గంభీర్‌ ఘటనపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో ఆర్సీబీ, లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ, గంభీర్‌ల మధ్య స్టేడియంలోనే గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. "ఓడిపోయిన వాళ్లు సైలెంట్‌గా ఓటమిని ఒప్పుకోవాలని.. గెలిచినవాళ్లను సెలబ్రేట్ చేసుకోనివ్వాలి. చిన్న దానికి ఎందుకు ఇంత పెద్ద రాద్ధాంతం చేశారు. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌లను కొన్ని లక్షల మంది అభిమానిస్తారు. వాళ్లు క్రికెట్ ఐకాన్స్.. అని కోహ్లీ, గంభీర్‌పై సెహ్వాగ్ ఫైర్" అయ్యారు.

"వాళ్లు చేసే ప్రతీ పనిని పిల్లలు ఫాలో అవుతూ ఉంటారు. నా ఫేవరెట్ క్రికెటర్ ఇలా చేశాడు, నేనెందుకు చేయకూడదని అనుకుంటారు. కాబట్టి మీరు క్రికెట్ క్రీజులో ఏం చేసినా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని" సెహ్వాగ్ సూచించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే బీసీసీఐ, గ్రౌండ్‌లో గొడవ పడే క్రికెటర్లను బ్యాన్ చేయాలి. అప్పుడే క్రికెట్ మైదానంలో గొడవ పడాలంటే క్రికెటర్లు భయపడతారని సెహ్వాగ్ సూచించారు.

Next Story

Most Viewed