గుజరాత్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ విషయంలో వాళ్లే టాప్

by Disha Web Desk 14 |
గుజరాత్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ విషయంలో వాళ్లే టాప్
X

దిశ, వెబ్ డెస్క్: టాటా ఐపీఎల్ 2023 ఎన్నో రికార్డులతో ఘనంగా ముగిసింది. గుజరాత్ టైటాన్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సీఎస్కే 5 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. కాగా ఈ ఐపీఎల్ లో సరికొత్త రికార్డులు సృష్టించబడ్డాయి. 250 మ్యాచులతో ఐపీఎల్ లో అత్యధిక మ్యాచులాడిన వ్యక్తిగా ధోని రికార్డు సృష్టించాడు. ఇక ఈ ఐపీఎల్ ఫైనల్ లో గుజరాత్ చేసిన 214 స్కోర్ ఇప్పటివరకు ఐపీఎల్ ఫైనల్ లో అత్యధిక స్కోరు. కాగా ఈ ఐపీఎల్ లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పబడింది. పర్పుల్ క్యాప్ జాబితాలో టాప్ 3 బౌలర్లలో ఒకే టీమ్ కు చెందిన బౌలర్లు ఉన్నారు. ఈ అరుదైన ఘనతను గుజరాత్ టైటాన్స్ బౌలర్లు సాధించారు.

పర్పుల్ క్యాప్ టాప్ జాబితాలో మహమ్మద్ షమీ (28) మొదటి స్థానంలో, 27 వికెట్లతో రషీద్ ఖాన్ రెండో స్థానంలో 24 వికెట్లతో మోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నారు. ఈ ముగ్గురు బౌలర్లు కూడా గుజరాత్ టైటాన్స్ కు చెందినవారే. రెండో టైటిల్ తృటిలో చేజారడంతో బాధలో ఉన్న జీటీ ఫ్యాన్స్ కు ఈ రికార్డు మాత్రం సంతోషాన్ని కలిగిస్తోంది. కాగా పర్పుల్ క్యాప్ జాబితాలో ముంబై ఇండియన్స్ కు చెందిన పీయూష్ చావ్లా (22) నాలుగో స్థానంలో, రాజస్థాన్ రాయల్స్ కు చెందిన చహాల్ (21) ఐదో స్థానంలో ఉన్నారు. ఇక ఆరెంజ్ క్యాప్( అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు) జాబితాలో గుజరాత్ బ్యాటర్ శుభ్ మన్ గిల్ (890 రన్స్) టాప్ పొజిషన్ లో ఉన్నాడు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story