ఐపీఎల్‌లో భారీ మార్పులు.. సాధారణ ప్లేయర్లుగా ధోని, రోహిత్, కోహ్లీ!

by Disha Web Desk 2 |
ఐపీఎల్‌లో భారీ మార్పులు.. సాధారణ ప్లేయర్లుగా ధోని, రోహిత్, కోహ్లీ!
X

దిశ, వెబ్‌డెస్క్: గతానికి భిన్నంగా ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. సరికొత్త రూల్స్‌తో పాటు ప్లేయర్లలోనూ భారీ స్థాయిలో మార్పులు జరిగాయి. ముఖ్యంగా MS ధోని, రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. గతంలో విరాట్ కోహ్లీ వదులుకోగా.. ఈసారి ధోని, రోహిత్ తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. సాధారణ ప్లేయర్లుగా ఈ ముగ్గురు బరిలోకి దిగుతుండటంతో బ్యాటింగ్‌పై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్, ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా ఫాఫ్ డూప్లేసిస్‌తో బరిలోకి దిగుతున్నారు.

మరోవైపు ఈ సీజన్‌లో మరో రెండు కొత్త రూల్స్‌ను తీసుకొచ్చారు.1, డెసిషెన్ రివ్యూ సిస్టమ్‌ (DRS)లో లోపాలను సరిచేయడానికి ఈ సంవత్సరం IPLలో స్మార్ట్ రీప్లే సిస్టమ్ (SRS) ప్రవేశపెట్టారు. ఎస్‌ఆర్‌ఎస్ నిబంధన అమలుతో ఈ ఐపీఎల్‌లో థర్డ్ అంపైర్ నిర్ణయం మరింత కచ్చితం కానుంది. 2, ఈ ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో 2 బౌన్సర్లు విసిరే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు ఒక ఓవర్‌లో 1 బౌన్సర్ మాత్రమే వేసేందుకు అనుమతి ఉండేది. ఇప్పుడు ఒకే ఓవర్‌లో రెండు బౌన్సర్లు వేసేందుకు బౌలర్లకు అనుమతి ఇచ్చారు. కాగా, రేపటినుంచి IPL 2024 సీజన్ 17 ప్రారంభమవుతుంది. చెన్నై వేదికగా జరగనున్న ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్‌లో ఆర్‌సీబీ జట్టు డిఫెండింగ్‌ చాంపియన్‌ సీఎస్‌కేతో తలపడనుంది.


Next Story