గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టు

by Disha Web Desk 15 |
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : స్థానిక ఆటోనగర్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు నిజామాబాద్ ఎక్సైజ్ టీం దాడి చేసింది. మంగళవారం ఉదయం ఆటోనగర్ లోని షకీలా బీ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 1.25 కేజీల గంజాయి లభించింది. గంజాయి ఎక్కడి నుండి తీసుకొస్తున్నారని విచారించగా తన కూతురు అస్మాతో కలిసి నాందేడ్ జిల్లాకి వెళ్లి కొనుగోలు చేసి

చిన్న చిన్న ప్యాకెట్లు గా చేసి తన అల్లుడు షేక్ వసీమ్ ద్వారా నిజామాబాద్ లోని యువతకి ఎక్కువ రేటుకి అమ్ముతామని తెలిపింది. షకీలా బీ ఇచ్చిన సమాచారంతో ఆమెతో పాటు కూతురు అస్మా, అల్లుడు షేక్ వసీంలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి.దిలీప్ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్టు పేర్కొన్నారు. ఈ తనిఖీలలో నిజామాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి.దిలీప్ , ఎక్సైజ్ ఎస్ ఐ మల్లేష్, సిబ్బంది ప్రభాకర్, షబ్బీరుద్దీన్, సంగయ్య, దారి సింగ్ పాల్గొన్నారు.

గంజాయి విక్రేతలను పట్టించింది గంజాయి స్మగ్లరేనా?

నిజామాబాద్ నగరంలోని ఆటో నగర్ లో గంజాయి క్రయ విక్రయాలు నిర్వహిస్తున్న కుటుంబం అరెస్టు వెనుక గంజాయి విక్రేతనే ఉన్నట్లు తెలిసింది. ఆటోనగర్ కు చెందిన షకీలాబీ ఇంటి పై దాడికి ముందు ఆమె అల్లుడు షేక్ వసీం చిన్న ప్యాకెట్లలో గంజాయి విక్రయిస్తుండగా సోమవారం పట్టుకున్నట్లు సమాచారం. స్థానిక మైనార్టీ ప్రాంతంలో గంజాయి విక్రయాలలో ఆరితేరిన వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు కేసుల (నెల వారి టార్గెట్ ) కోసం ఒత్తిడి తేవడంతో అతను ఇచ్చిన క్లూతో గంజాయి విక్రయాలు చేస్తున్న వారిని పట్టుకున్నట్లు తెలిసింది. అయితే సదరు స్మగ్లర్ ను మాత్రం మచ్చిక చేసుకొని అతడిని అరెస్టు చేయకపోవడం వెనుక మతలబు ఉందని తెలిసింది.



Next Story

Most Viewed