ముఠాగా ఏర్పడి గంజాయి రవాణా.. ఇద్దరు నిందితుల అరెస్ట్

by Disha Web Desk 23 |
ముఠాగా ఏర్పడి గంజాయి రవాణా.. ఇద్దరు నిందితుల అరెస్ట్
X

దిశ,రాయికల్ : ముఠాగా ఏర్పడి గంజాయి రవాణా చేస్తున్న జగిత్యాల పట్టణానికి చెందిన కొండూరి రాజేష్, అరుముల్ల సాయి కుమార్ లు ఇటీవల గంజాయి కేసులో రిమాండ్ అయినా పెనుగొండ గణేష్, మలవాత్ సతీష్ లతో ముఠాగా ఏర్పడి జగిత్యాలకు గంజాయి తరలిస్తున్నట్లు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. గురువారం రాయికల్ పట్టణంలో వాహన తనిఖీల్లో వీరు గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కినట్లు డీఎస్పీ రఘు చందర్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం .. జగిత్యాల పట్టణానికి చెందిన కొండూరి రాజేష్, అరుముల్ల సాయి కుమార్ లు రాయికల్ శివారులో వాహన తనిఖీల్లో గంజాయి తరలిస్తు పోలీసులకు చిక్కారన్నారు.

రాయికల్ శివారు కుమ్మరి పల్లి బస్టాండ్ వద్ద పట్టుకుని విచారించగా వారి వద్ద గల సంచి లో 1.5 కిలోల ఎండు గంజాయి లభించిందన్నారు. నిందితుల వద్ద నుంచి 1.5 కేజీల గంజాయి, సెల్ ఫోన్ స్కూటీ ని స్వాధీన పరచుకొని విచారించగా వారు చేసిన నేరం ఒప్పుకున్న రన్నారు. కొండూరి రాజేష్ పై జగిత్యాల రూరల్, మల్యాల, వరంగల్ జిల్లా నెక్కొండ పోలీస్ స్టేషన్ లలో గంజాయి కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

మరో నిందితుడు అరుముల్ల సాయి కుమార్ పై వరంగల్ జిల్లా నెక్కొండ లో గంజాయి కేసు, జగిత్యాల టౌన్ లో బండి దొంగతనం కేసులు ఉన్నట్లు తెలిపారు. ఇటీవల గంజాయి కేసులో రిమాండ్ అయిన పెనుగొండ గణేష్, మలవాత్ సతీష్ తో పాటు జగిత్యాల పట్టణానికి చెందిన కొండూరి రాజేష్. అరుముల్ల సాయి కుమార్ కొంత మంది వ్యక్తులు ఒక గ్రూపు గా ఏర్పడి సీలేరు కి వెళ్లి తక్కువ ధర కు గంజాయి ని కనుక్కొని, జగిత్యాల జిల్లా కు తీసుకు వచ్చి, ఇక్కడ అమాయక యువత కు ఎక్కువ ధరకు అమ్మ తున్నారన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న రూరల్ సిఐ ఆరిఫ్ అలీ, రాయికల్ ఎస్సై అజయ్ కానిస్టేబుల్స్ సాగర్, ప్రశాంత్ లను జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్, డీఎస్పీ రఘు చందర్ లు అభినందించారు.


Next Story