ఘోర రోడ్డు ప్రమాదం.. కొడుకు స్పాట్‌డెడ్.. తండ్రి సీరియస్

by Rajesh |
ఘోర రోడ్డు ప్రమాదం.. కొడుకు స్పాట్‌డెడ్..  తండ్రి సీరియస్
X

దిశ, మెట్‌పల్లి/ ఇబ్రహీంపట్నం : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో లారీని కారు ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మెట్‌పల్లి పట్టణానికి చెందిన శివరామకృష్ణ తన కొడుకు అక్షయ్‌తో తెల్లవారుజామున కారు లో నిజామాబాద్ నుండి తిరుగు ప్రయాణంలో ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ (గండి హనుమాన్ దేవాలయం) శివారులో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నారు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా అప్పటికే కొడుకు అక్షయ్ మరణించినట్లు గుర్తించారు. తండ్రి శివరామకృష్ణకు రెండు కాళ్ళు, ఒక చేయి విరిగిందని పరిస్థితి విషమంగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదం లో కారు నుజ్జునుజ్జయింది. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఒకేరోజు 24 గంటల వ్యవధిలో తండ్రి కొడుకులు వేర్వేరు రోడ్డు ప్రమాదాలకు గురికావడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story