BREAKING: స్మగ్లర్ల కొత్త ఎత్తుగడ.. అమెజాన్ పర్సిల్‌లో యథేచ్ఛగా గంజాయి రవాణా

by Disha Web Desk 1 |
BREAKING: స్మగ్లర్ల కొత్త ఎత్తుగడ.. అమెజాన్ పర్సిల్‌లో యథేచ్ఛగా గంజాయి రవాణా
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్, గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పని చేయాలంటూ ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు నగరంలోని పోలీసులు డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అనంతరం బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపడుతూ పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను సీజ్ చేస్తున్నారు. ఆ విషయం అటుంచితే పోలీసులకు డ్రగ్స్, గంజాయి స్మగ్లర్లు షాకిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ద్వారా గంజాయి విక్రయాలకు తెర లేపారు.

తాజాగా, గురువారం రాత్రి మేడ్చల్‌లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇక్కడే అసు ట్విస్ట్ చోటుచేసుకుంది. స్మగ్లర్లు చేసిన పని చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఒరిస్సా నంచి హైదరాబాద్‌కు ఎవరికీ అనుమానం రాకుండా అమెజన్ పార్సిల్‌లో తరలిస్తున్న గంజాయిని ఎస్‌వో‌టీ టెమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి సుమారు 2 కిలోల పైనే ఉన్నట్లుగా గుర్తించారు. గంజాయిని అమెజాన్ కొరియర్‌లో అక్రమంగా తరలిస్తున్నారని పక్కా సమాచారం మేరకు పోలీసులు ఆ పార్సిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దందాలో అసలు గ్యాంగ్ ఎవరనే దానిపై విచారణ చేపడుతున్నారు.



Next Story