అయోధ్యకు సైబర్ నిపుణుల హైలెవల్ టీమ్.. ఎందుకంటే ?

by Dishanational4 |
అయోధ్యకు సైబర్ నిపుణుల హైలెవల్ టీమ్.. ఎందుకంటే ?
X

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జనవరి 22న జరగనున్న తరుణంలో కేంద్ర హోంశాఖ అలర్ట్ అయింది. ఆ రోజున ఏవైనా సైబర్ ఎటాక్స్ జరిగితే ఎదుర్కొనేందుకు ఒక ఉన్నత స్థాయి బృందాన్ని అయోధ్యకు పంపింది. ఈ టీమ్‌లో కేంద్ర హోంశాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ), కేంద్ర ఐటీశాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్ - ఇన్)లకు చెందిన సైబర్‌ నిపుణులు ఉన్నారు. అయోధ్య ఆలయంలోకి వీఐపీల ప్రవేశంపై సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లో పంపే మెసేజ్‌లు, హానికరమైన ఏపీకే ఫైల్స్ పట్ల పౌరులు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర హోం శాఖ సైబర్ సెక్యూరిటీ విభాగం ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసే క్రమంలోనే అయోధ్యకు ఇప్పుడు ప్రత్యేక టీమ్‌ను పంపారు.

Next Story

Most Viewed